గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలో కలతలు ఉన్నాయని అన్నయ్యతో తమ్ముడు విభేదించాడని అందుకే తమ్ముడు పార్టీ కూడా పెట్టి అన్నయ్య పార్టీకి ఎసరు పెట్టాడని రక రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చిన న్యూస్ తో ఇవన్ని పటాపంచాలు అయ్యాయా అంటే అవుననే చెప్పాలి.

త్వరలో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే రోజులు వస్తున్నాయి. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని పవన్ కార్యాలయం అధికారికంగా వెల్లడించగా, ఇపుడు రామ్ చరణ్ కూడా ధృవీకరించారు. పవన్‌ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించే తొలి చిత్రం ఇదే.

తన బ్యానర్ పై మొదటి సినిమా ఛాన్స్ తన అన్న కొడుక్కే ఇవ్వడం ఆయనకు తన ఫ్యామిలీ మిత ఉన్న ప్రేమ ఏంటో చెప్పకనే చెబుతున్నారు. ఇదిలావుంటే పవన్ నిర్మించే సినిమాలో నటిస్తున్నట్టు చెర్రీ కూడా తన సన్నిహితుల వద్ద కన్‌ఫార్మ్ చేశాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న రామ్ చరణ్.. అది పూర్తయిన వెంటనే పవన్ నిర్మించే సినిమాలో నటించే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు ‘మెగా’ వారి ఆడియో ఫంక్షన్లు ఏవి జరిగినా పవన్ వచ్చేవాడు కాదు కానీ అబిమానులు అడిగే ప్రశ్నకు మాత్రం చరణ్ బాబాయ్ ఎక్కడో లేడు తమ గుండెల్లోనే ఉన్నాడని చెబుతూ వస్తున్నాడు. మరి ఈ బాబాయి అబ్బాయి కలిసి సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: