వరస పరాజయాలతో సతమతమై పోతున్న అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ‘బందిపోటు’ కూడా పరాజయం చెందడంతో అల్లరి నరేష్ ప్రస్తుతం తీవ్రమైన అంతర్మధనంలో కొట్టు మిట్టాడుతూ తదుపరి సినిమాకు సంబంధించి ఎటువంటి సబ్జక్ట్ ఎంచుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో అల్లరోడు రోజులు గడుపుతున్నాడు అని టాక్. అంతేకాదు నరేష్ కు జాతక రీత్యా బ్యాడ్ పిరియడ్ నడుస్తోందా అనే వ్యాఖ్యలను కూడా అతడి సన్నిహితులు బహిరంగంగానే చేస్తున్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితికి నరేష్ వ్యవహార శైలి కూడ కొంత ప్రధాన పాత్ర వహిస్తోంది అనే మాటలు వినపడుతున్నాయి. అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణకు సినిమా స్క్రిప్ట్ పై ఉండే జడ్జిమెంట్ లో అల్లరోడికి సగం కూడ వంటబట్ట లేదని దీనితో తనకు సరిపడని స్క్రిప్ట్ లు ఎంచుకుని సినిమాలుగా తీస్తూ నటిస్తూ ఉండటంతో ఈ నవ్వుల హీరోకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు.

అదీ కాకుండా ఇవివి సత్యనారాయణ బ్రతికి ఉన్న రోజులలో మీడియాతో రచయితలతో సన్నిహితంగా ఉండేవారని, కాని నరేష్ దీనికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉండటంతో చాలామంది రచయితలు, దర్శకులు నరేష్ కు దూరం అవుతున్నారని ఫిలింనగర్ టాక్. లేటెస్ట్ గా వచ్చిన ‘బందిపోటు’ పరాజయంలో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు సగభాగం భాద్యత ఉంటే అటువంటి చెత్త కథను ఎంచుకున్న నరేష్ కు సగ భాగం భాద్యత ఉంది అంటూ మాటలు వినిపిస్తున్నాయి.

గతంలో అల్లరోడికి హిట్స్ అందించిన రవిబాబు కాని సత్తిబాబు కాని నరేష్ కు హిట్స్ అందివ్వలేని నేపధ్యంలో ఎటువంటి దర్శకుడిని మరి ఎటువంటి కథను ఎంచుకోవాలి అని తెలియని అయోమయ పరిస్థితిలో ఈ అల్లరోడు ఉన్నాడు అని టాక్. ఎలా చూసుకున్నా ఒకనాటి ఈ సుడిగాడు ప్రస్తుత పరిస్థుతులలో పూర్తిగా తన క్రేజ్ పోగొట్టుకున్నాడు అన్నది వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: