సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగటమే కాకుండా, ఇతర హీరోయిన్స్ కి కూడ పోటీ ఇస్తున్న బ్యూటీ ,హీరోయిన్ అనుష్క. అవును, అనుష్క వయసు మూడు పదులు దాటినప్పటికీ, నేటి యంగ్ హీరోయిన్స్ కి మంచి పోటీ ఇస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో అనుష్క కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అలాగే ఆఫర్స్ ని సైతం స్టార్ హీరోల సరసన అందుకుంటుంది.

రజనీకాంత్, సూర్య, అజిత్ , విజయ్ ఇలా టాప్ హీరోలతో అవకాశాలను అందుకున్న ఈ బ్యూటీ, తాజాగా మరో బంపర్ ఆఫర్ ని కూడ అందుకుంది. వివరాల్లోకి వెళితే, ఇటివలే కమల్ నటించిన ‘ఉత్తమ విలన్’ పాటలు విడుదలయ్యాయి. త్వరలో సినిమా విడుదల కానుంది. ఇది కాకుండా కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం 2′, దృశ్యం రీమేక్ ‘పాపనాశనం’ సినిమాలు నిర్మాణంతర కార్యక్రమాలలో ఉన్నాయి.

ఈ మూడు సినిమాల షూటింగులు పూర్తయ్యాయి. ఆ తర్వాత కమల్ హాసన్ సొంత డైరెక్షన్ నుండి త్వరలో ఓ థ్రిల్లర్ సినిమాలో నటించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇటివలే మారిషస్ వెళ్లి లొకేషన్లు ఎంపిక చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ థ్రిల్లర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని కమల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

అయితే కమల్ హాసన్ సొంత డైరెక్షన్ లో రాబోతున్న ఈ థ్రిల్లర్ మూవీలో అనుష్క హీరోయిన్ గా ఆఫర్ ని కొట్టేసిందనే వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్ మెంట్ త్వరలోనే బయటకు రానుందని కోలీవుడ్ వర్గాల అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: