టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్న స్టార్ హీరో మహేష్ బాబు. మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో ఉన్నాడు. అలాగే తన ముందు దాదాపు మరో అయిదు చిత్రాల వరకూ, వరుస కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే రాత్రికి రాత్రే స్టార్ డం స్టేటస్ ని తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, రీసెంట్ గా మహేష్ బాబు సిటీలోకి వచ్చాడని తెలుసుకొని, తనని కలుసుకున్నాడనే టాక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. నెల రోజుల పాటు పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత నేపధ్యంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన మూవీ యూనిట్ ఇటివల హైదరాబాద్ చేరుకుంది. విరామం తీసుకోకుండా రామోజీ ఫిల్మ్ సిటీలో వెంటనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ షెడ్యేల్ లో మహేష్ కి సంబంధించిన రెగ్యులర్ సీన్స్ ని షూటింగ్ చేస్తున్నారంట. ఇదిలా ఉంటే డైరెక్టర్ హరీష్ శంకర్, మహేష్ ని కలిసిన ఓ స్టోరి వినిపించినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే, మహేష్ బాబు మాత్రం మరో 4 సంవత్సరాల వరకూ కాల్షీట్స్ లేవు అన్నట్టుగా చెప్పటంతో, హరీష్ వెనుదిరిగినట్టు ఇండస్ట్రీలో న్యూస్ తెలుస్తుంది. కాని, హరీష్ చెప్పిన కథకు మహేష్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడంట. మొత్తంగా హరీష్ లక్ బాగుంటే మహేష్ తో మూవీ వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉందేమో? అని అంటున్నారు.

ఇక కోరటాల శివ-మహేష్ బాబు మూవీ వివరాలలోకి వెళితే, సరికొత్త హెయిర్ స్టైల్, అల్ట్రా మోడరన్ లుక్, సూపర్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మహేష్ తండ్రిగా జగపతి బాబు నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ఇంకా వర్కింగ్ టైటిల్ గానే ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: