సిద్ధార్థ్ సమంతల బ్రేకప్ వ్యవహారం ఓపెన్ సీక్రెట్ గా మారిపోవడంతో వీరిద్దరి పై మీడియా వార్తలు వ్రాయడం మానేసింది. అంతేకాదు వీరిద్దరూ విడిపోవడంతో టాలీవుడ్ లో నిర్మింప బడుతున్న కొన్ని సినిమాల హీరో హీరోయిన్స్ ఎంపికలో కూడా అనేక మార్పులకు కారణమైంది. సిద్ధూ సమంతలు కలిసి ఉన్న రోజులలో ఒకరోజు సమంతకు రోడ్డు పై ఎటువంటి ఆలనా పాలనా లేని ఒక కుక్క పిల్ల కనిపించిందట.

ఆ కుక్క పిల్ల పై మోజు పడ్డ సమంత ఆ కుక్కను సిద్ధార్థ్ ఇంటికి తీసుకు వచ్చి ఇంటిలో ఉంచిందట. అంతేకాదు ఆ కుక్క పిల్లకు ‘నోరి’ అన్న పేరు పెట్టి ఆ కుక్క పిల్లను గారాబంగా చూసుకుందట సమంత. అప్పటికే సిద్దార్థ్ ఇంటిలో సిద్ధూ పెంచుకుంటున్న ‘మోగ్లీ’ అనే మగ కుక్క పిల్లతో సమంత తెచ్చిన నోరి కూడా కలిసిపోయి ఆ మగ కుక్కతో ఆనందంగా సహజీవనం చేసాయట.

అయితే సిద్దార్థ్ సమంతలు బ్రేకప్ అయి విడిపోయినా సిద్ధూ ఇంటిలో ఆ కుక్క పిల్లల జంట మోగ్లీ – నోరి లు ఇప్పటికి ఆనందంగానే కలిసి ఉన్నాయని ఈమధ్య ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ చెప్పాడు.

అంతేకాదు కుక్కపిల్లలు బ్రేకప్ వ్యవహారాలను అర్ధం చేసుకోలేవు కదా అంటూ సెటైర్లు వేసాడు. అంతేకాదు మరో ట్విస్ట్ ఏమిటంటే నోరి త్వరలోనే తల్లిగా మారి సమంత జ్ఞాపకాలను మరింత పెంచబోతోంది అన్న విషయం కూడా సిద్దూ సూచన ప్రాయంగా చెప్పడం మరో విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: