తొలుత బట్ట లేదు, తుదకు బట్ట లేదు, నడుమ బట్ట గట్ట నగుబాటు కాదా ఈ మాటలు ఎవరన్నారో తెలుసా యోగి వేమన. ఆయన ఏదో వేదాంత దోరణిలో బాహ్య సౌందర్యం గురించి అలా వ్యంగ్యంగా పద్యం చెప్పాడు అంతే.. కానీ మన హీరోయిన్స్ అందులో అర్థం అదికాదేమో అనుకుంటున్నారు.

మనం పుట్టేటపుడు బట్టలు వేసుకొని పుట్టామా వెదవది మధ్యలో ఈ కట్టూ బొట్టు ఏంటా అని అనుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ అదే నండి మన బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే ఒక ఇంటర్య్పూలో మనం పుట్టేప్పుడు బట్టలేసుకొని పుట్టామా ఏంటీ..? మరి ఇప్పుడు బట్టలు వేసుకోకపోవడం లో తప్పేంటి అని హాట్ హీరోయిన్ రాధిక ఆప్టే ప్రశ్నిస్తోంది.

రక్త చరిత్ర, లెజెండ్, లయన్ లలో నటించిన రాధిక ఆప్టే చాలా బాద వ్యక్తం చేసింది. తాను నగ్నంగా నటించడం అనేది ప్రపంచ సినిమాలో అసలు వార్తే కాదని, కానీ ఇండియా లో మాత్రం ఆ విషయం పెద్ద రచ్చ అవుతుందని ఆప్టే వాపోయింది.

ఇండియన్ సినిమాల్లో కూడా నగ్నం గా నటించడం కొత్త కాదని , అలా చేసిన వాళ్ళని మాత్రం అదోరకంగా చూస్తారని రాధికా ఆప్టే బాధపడిపోయింది. ఆ మధ్య రాధికా ఆప్టే న్యూడ్ ఫొటోస్ అని కుర్రాళ్ళు తెగ షేర్ చేసుకున్న ఫోటోలు నావి కావు అని అప్పట్లో వివరణ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు నగ్నంగా నటిస్తే తప్పేంటి అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: