సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా స్టార్ డంని సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రుతిహాసన్. ఇదిలా ఉంటే రీసెంట్ గా శ్రుతిహాసన్ చెల్లి అక్షర హాసన్ సైతం బిటౌన్ లోకి ఎంట్రి ఇచ్చింది. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఇద్దరి హాట్ హారోయిన్స్, హాట్ టాపిక్ గా మారారు.

వివరాల్లోకి వెళితే, శృతిహాసన్‌, అక్షర హాసన్‌.. అక్కా చెల్లెళ్లులుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి తెలుసిన విషయమే. శృతి హాసన్ తెలుగు, తమిళ్‌, హిందీ మూడు భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా తనని తాను నిరూపించుకుంది. ఇక్క అక్క దారిలోనే చెల్లి అక్షర హాసన్‌ తన డెబ్యూ ఫిల్మ్ షమితాబ్‌ చిత్రంలో క్యూట్‌ లుక్స్ తో హాట్ ఎక్స్ ప్రెషన్స్ ని ఇచ్చింది.

అయితే వీరిద్దరిలో కామన్‌గా కొన్ని విషయాలున్నాయి. అవి యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సెక్సప్పీల్‌ నుంచి, డ్రెస్సిగ్‌ సెన్స్‌ వరకూ వీరిద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఇద్దరకి మచ్చలు అంటే బాగా ఇష్టం అంట. అదేనండీ ఈ ఇద్దరికీ పచ్చబొట్లు పిచ్చి. ఈ అక్కా చెల్లెళ్లు ఇద్దరూ భుజభాగంపై టట్టూలు వేయించుకుంటున్నారు.

అరక్ష కుడి భుజంపై తాజాగా టట్టూ వేయించుకుంది. అయితే గతంలో శ్రుతి తన ఎడమ భుజంపై టట్టూ వేయించుకున్న విషయం తెలిసిందే. తెలిసింది. శృతిహాసన్ భుజంపై టట్టూ తమిళ అక్షరాలతో రాసి ఉంది. అక్షర భుజంపై టట్టూ ఓ శాంతి కపోతంతో ఉంది. మొత్తంగా వీరిద్దరూ కలిసి ఏదైనా ఫంక్షన్ వెళ్ళారంటే, కచ్ఛితంగా వీరి టాటూలను చూపించుకోవటానికి ఏ మాత్రం సందేహపడరంట.

మరింత సమాచారం తెలుసుకోండి: