విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మించబోతున్న ఒక సినిమా భారతీయ సినిమా రంగంలో ఒక నూతన సంచలనానికి శ్రీకారం చుట్టబోతోంది. కమల్ నిర్మాతగా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిర్మించినా ఈ సినిమా మటుకు భారతదేశ రాజకీయ రంగంలో కూడ ఒక తీవ్ర సంచలనాన్ని సృష్టించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

కమల్ త్వరలో నిర్మించబోతున్న ఈ సినిమా పేరు ‘అమర్ హై’ ఈ సినిమాను నిర్మించడమే కాకుండా ప్రధాన పాత్రలో కమల్ నటించబోతున్నాడు. కమల్ తో పాటు మరొక బాలీవుడ్ హీరో ఈ సినిమాలో నటిస్తాడు అని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలు, మనీ లాండరింగ్‌ తదితర అంశాలపై ప్రశ్నలు సంధించేలా ఈసినిమా ఉండబోతోందని టాక్.

పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి అని అంటున్నారు. నవంబర్ లో ప్రారంభం కానున్న ఈ సినిమాను కేవలం 5 నెలలో పూర్తి చేసి వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే ఉద్దేశ్యంలో కమల్ ఉన్నాడు. ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న రాజకీయ అవినీతి నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని టాక్.

ఇప్పటికే కమల్ తాను నటించిన 'ఉత్తమవిలన్‌', 'పాపనాశం', 'విశ్వరూపం2' సినిమాలను పూర్తి చేసి ఈ సంవత్సరం వరసగా తన మూడు సినిమాలను విడుదల చేసిన రికార్డును సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో స్పీడ్ గా తన సినిమాల నిర్మాణం పూర్తి చేసాడు. ఆరు పదుల వయస్సులో కమలహాసన్ స్పీడ్ ను చూసి కోలీవుడ్ షాక్ అయిపోయింది అని వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: