ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ‘సైజు జీరో సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తి కర న్యూస్ మీడియాకు లీక్ అయింది. ఈ సినిమాలో అనుష్క ఒబిసిటితో బాధ పడే ఒక అమ్మాయి పాత్ర పోషి స్తోంది. ఈ పాత్ర కోసం అనుష్కను 20 కెజీల బరువు పెరగాలని దర్శకుడు ప్రకాష్ సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ‘బాహుబలి’ కోసం పెంచుకున్న తన శరీరాన్ని మళ్ళీ పెంచుకోమని దర్శకుడు చెప్పడం అనుష్కకు షాకింగ్ గా మారింది అని అన్న్తున్నారు.

లావుగా ఉన్న అమ్మాయిని ఒక అందమైన అబ్బాయి ప్రేమించే వెరైటీ కథతో ఈసినిమా తీయబోతున్నారని టాక్. శారీరక సౌందర్యం కన్నా మానశిక సౌందర్యం చాల ముఖ్యo అని నేటి యువతరానికి సందేశం ఇచ్చే సినిమాగా ఈ ‘సైజు జీరో’ పూర్తి హాస్య సన్నివేశాలతో తీయబోతున్నారని టాక్.

క్రియేటివ్ దర్శకుడు క్రిష్ ఈ సినిమా కోసం డైలాగ్స్ రాస్తూ ఉంటే రాఘవేంద్రరావు కోడలు కనిక ధిల్లాన్ ఈసినిమాకు కథను అందిస్తోంది. ఈ సినిమాలో అనుష్క పక్కన హీరోగా కోలీవుడ్ హీరో ఆర్య నటిస్తున్నా సినిమా మొత్తం అంతా అనుష్క చుట్టూనే తిరుగుతుంది.

అనుష్క తో పాటు ఒక ప్రత్యేక పాత్రలో శ్రుతిహాసన్ నటిస్తున్న ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొంద బోతోంది అనే వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా అనుష్క మారిపోతూ ఉండటంతో బహుశా రానున్న రోజులలో అనుష్క గ్లామర్ పాత్రలకు దూరమైపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: