టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, త్వరలోనే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ గా చెప్పుకునే స్థాయికి మారొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తను తెరకెక్కిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ బాహుబలి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై కూడ ప్రభావితం చూపుతుందనే టాక్స్ క్లియర్ గా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే రాజమౌళి, తాజాగా యూ-ట్యూబ్ తో బాహుబలి ప్రమోషన్స్ డీలింగ్ ని మాట్లాడినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ మరియు ఇతర భాషలలో ఈ సినిమాను మే 15న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాపై భారతీయ సినీ పరిశ్రమలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. అంతర్జాతీయ సినిమాలను తలదన్నే రీతిలో రాజమౌళి సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడటంతో, సరిగ్గా రిలీజ్ కి ఒక నెల ముందు రోజుల, యూ-ట్యూబ్ హోమ్ పేజ్ లో బాహుబలి మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ ని చేపట్టాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడంట.

గతంలో షారుఖ్ నటించిన రావన్ మూవీకి యూ-ట్యూబ్ లో ఏ విధంగా ప్రమోషన్ యాక్టివిటీస్ చేశారో, సరిగ్గా ఆతరహాలో బాహుబలి మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని యూ-ట్యూబ్ లో చేయాలని చూస్తున్నాడు. ఈ విధంగా చేస్తే బాహుబలికి బ్రాండ్ క్రియేట్ అవుతుందనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు. ప్రభాస్, అనుష్క, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: