హాలీవుడ్ లో ఏ సినిమా చేసినా ఒక సంచలనాత్మకంగా ఉంటుంది. రికార్డులు క్రియేట్ చేయాలన్నా వారే దాన్ని బీట్ చేయాలన్నా వాళ్లకే తగింది. సినిమాలే కాదు కార్టూన్, యానిమేషన్ లో కూడా వారిదే పైచేయి. విషయానికి వస్తే ఒకే ఒక్కడు 24 పాత్రలుచేస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి.

ఇలాంటి ప్రయోగాలు అప్పట్లో మన తెలుగు సినిమాల్లో కూడా చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నవరాత్రి సినిమాలో తొమ్మది గెటప్స్ లో కనబడతాడు. అప్పట్లో ఈ విషయం చాలా సెన్సెషనల్. తర్వాత కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమాలో పది పాత్రల్లో నటించి మెప్పించాడు.

హాలీవుడ్ లో లేటెస్ట్ గా ఈ హీరో మాత్రం ఏకంగా 24 పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నాడు? అవును ఆ హీరో ఎవరో కాదు ? టైటానిక్ హీరో లేయోనార్దో డి కాప్రియో ! ఈ హీరో 24 పాత్రల్లో నటించి చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

క్రౌడేడ్ రుం అనే సినిమాలో ఆయన నటిస్తున్నాడు. నిజంగా ఈ టైటానిక్ హీరోకి ఇది అగ్ని పరీక్షే ? 1981 లో వచ్చిన ఓ పాపులర్ నవల ఆధారంగా ఈ సినిమా ఉంటుందట. 24 పాత్రలు అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: