పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్షన్ అంటేనే ఒక థ్రిల్ సినిమా హిట్ టాక్.. ఇక ప్రభాస్ సినిమా అంటే పడిచచ్చేవారెందరో.. అయితే గతంలో పూరీ, ప్రభాస్ కాంబినేషన్ లో ఏక్ నిరంజన్ వచ్చింది. అది అంతగా పేరు రాకపోయినా ప్రభాస్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చింది.

అప్పటి నుంచి ప్రభాస్, పూరి మంచి మిత్రులయ్యారు. ఈ మధ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన టెంపర్ ఏ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక పోతే పూరీలో ప్రత్యేకమైన స్టయిల్ ఏమిటంటే పోలీస్ స్టోరీస్ మనోడు పోలీస్ స్టోరీ తీయడంలో దిట్ట. శివ‌మ‌ణి, పోకిరి, గోలీమార్‌.. లేటెస్టుగా టెంప‌ర్ తో వెరైటీ పోలీసుల్ని చూపించాడు పూరి.

ప్రభాస్ పూరీ వద్ద ఉన్న చనువుకొద్దీ తన కోసం కూడా ఓ మంచి వెరైటీ పోలీస్ స్టోరీ తయారు చేయమని పురిగొలిపినట్టు సమాచారం..? మరి పూరీ మనోడి కోసం ఎంత పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ అందిస్తాడో ఈ చిత్రం ఎప్పడు సెట్ పైకి వస్తుందో వేచి చూడాల్సిందే..

. .

మరింత సమాచారం తెలుసుకోండి: