పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో వస్తున్న వార్తలను ఆ శక్తికరంగా పరిశీలిస్తున్న విశ్లేషకులకు కూడ ఈరోజు రాబోతున్న వార్తలు అత్యంత ఆ శక్తి దాయకంగా మరో కొన్ని గంటలలో మారబోతున్నాయి. పవన్ జనసేన అధ్యక్షుడి హోదాలో తుళ్ళూరు పరిసర గ్రామాల ప్రాంతాలలో పర్యటించడానికి ఈరోజు ఉదయం 8:30 లకు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లి, ఎర్రబాలెం, బేతంపూడి, తుళ్లూరులో ప్రాంతాల రైతులతో మాట్లాడి వారి పరిస్థితులని అడిగితెలుసుకోవడానికి తన జనసేన యాత్రను నిర్వహించ బోతున్నాడు.

తమ వద్ద నుండి బలవంతంగా ల్యాండ్ పుల్లింగ్‌కి పాల్పడుతూ ఏపీ ప్రభుత్వం తమకు బతుకు దెరువు లేకుండా చేస్తోందని చాలామంది రైతులు గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో వారిని కలిసి వారి బాధలను తెలుసుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పవన్ ఈ యాత్రను చేపట్టాడు. సాయంత్రం వరకు అక్కడి ప్రాంతాలలోని రైతులను కలుసుకుని తిరిగి రాత్రికి తన పర్యటనను ముగించుకుని పవన్ హైదరాబాద్ కు తిరిగి వస్తాడని తెలుస్తోంది.

అటు రాజకీయ వర్గాల లోను ఇటు సామాన్యులలోను ఆ శక్తి కలిగిస్తున్న ఈ పర్యటనలో పవన్ అధికార పార్టీ దూతగా వస్తున్నాడా ? లేదంటే ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తాడా? అన్న సందేహం అందరిలోనూ కలుగుతోంది. భారతీయ జనతా పార్టీకి తెలుగు దేశానికీ మద్దతు పలకడమే కాకుండా ఈ ఇరు పక్షాలకు తన ఇమేజ్ తో తన అభిమానుల చేత ఓట్లు వేయించిన పవన్ ఇప్పట్లో ఎన్నికలు లేని నేపధ్యంలో తెలుగుదేశాన్ని భారతీయ జనతా పార్టీని ఘాటుగా విమర్శించే సాహసం చేయడు అని విశ్లేషకుల భావాన.

అన్యాయాలను ప్రశ్నిస్తాను అని జనసేన పెట్టిన పవన్ పెద్దగా ప్రశ్నలు వేయకుండా రైతుల గోడు విని వారికి ధైర్యం చెప్పి నెమ్మదిగా రైతులను శాంత పరిచే శాంతి దూతగా పవన్ రేపటి పర్యటన ఎటువంటి అద్భుతాలు లేకుండానే ముగిసి పోతుందని రాజకీయ పండితుల జోష్యం. అయినా సునామి లాంటి పవన్ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అంత సాధ్యమా !

మరింత సమాచారం తెలుసుకోండి: