ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం ఇద్దరు హీరోలు మాత్రమే నేషనల్ మార్కెట్ లో టాప్ లిస్ట్ లో ఉన్నారు. వారిలో ఒకరు మహేష్ బాబు అయితే, మరొకరు అల్లుఅర్జున్. అవును, కమర్షియల్ బ్రాండ్స్ కి అంబాసిడర్స్ గా టాలీవుడ్ నుండి ఎవరిని ఎంపిక చేసుకోవాలి? అనే క్వశ్ఛన్ నేషనల్ మార్కెట్ లో వస్తే, చాలా మంది మహేష్ , అల్లుఅర్జున్ పేర్లనే సూచిస్తున్నారు. వీరిద్దరూ ఓ వైపు మూవీలను చేస్తూనే, మరోవైపు బ్రాండ్స్ కి అంబాసిడర్స్ గా కొనసాగుతుంది.

దీంతో ఒకేసారి డబుల్ ప్రాఫిట్స్. ఇదిలా ఉంతా తాజాగా అల్లుఅర్జున్ టూవీలర్ కంపెనీలో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. దానికి సంబంధించిన వివాల్లోకి వెళితే, అల్లు అర్జున్.. కమర్షియల్ యాడ్ ప్రపంచంలో సైతం తన జోరు చూపిస్తున్నాడు.

ఓ.ఎల్.ఎక్స్, లాట్ మొబైల్స్ తదితర కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్, తాజాగా మరో కంపెనీకి తన సేవలను అందించనున్నాడు. ప్రముఖ టు వీలర్ కంపెనీ హీరో సంస్థకు చెందిన గ్లామర్ 125 సిసి బైక్ బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేశాడు. ఇటివలే విడుదల ఈ యాడ్ వీడియోలో స్టైలిష్ & గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోయే సినిమా మొదలుపెడతారు. అల్లుఅర్జున్ నటించిన ఆ కమర్షియల్ ని చూడటం కోసం మీ కోసం కింద వీడియోను పొందుపరిచాం.

మరింత సమాచారం తెలుసుకోండి: