ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలక్రిష్ణ నటిస్తున్నఅప్ కమింగ్ ఫిల్మ్ లయన్ హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే, నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న సినిమా తాజా ‘లయన్’. ఈ సినిమా డైలాగులు లీక్ అయ్యాయంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ లీకేజీల వ్యవహారం ఏవరో చేసింది కాదు. స్వయంగా హీరో బాలకృష్ణ స్వయంగా డైలాగులు లీక్ చేయడం విశేషం. తన తాజా రాజకీయ పర్యటనలో విడుదలకు రెడీ అవుతున్న ‘లయన్’ డైలాగులను చెప్పి.. అభిమానులను సంతోషపరిచారు. ప్రస్తుతం ఈ డైలాగులు ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్నాయి.

‘నన్ను పడుకోబెట్టడానికి…. ఎప్పుడో పడుకున్న నీ తాత ముత్తాతలు దిగివచ్చినా ఏం పీకలేరురా..’ ‘నాకు పుట్టుకతోనే దేవుడు ప్రతీ పార్ట్ లో ఒక పవర్ దాచాడు.. పొరపాటున ఒక్క పార్టును టచ్ చేసినా….’ ఇవి ‘లయన్’ సినిమాలో బాలకృష్ణ డైలాగులు.

డైలాగులు లీక్ అయినా నాకు భయం లేదు. పైరసీ రూపంలో సినిమా లీకయినా, మీరు థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తారు. అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మొత్తానికి బాలక్రిష్ణ చెప్పిన డైలాగ్స్ నందమూరి ఫ్యాన్స్ ని అమితంగా ఆకట్టుకున్నాయంట. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సత్యదేవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మార్చి 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: