టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమైన కుదరని కాంబినేషన్స్ ఉంటే, వాటిని ఎలాగైన తీర్చుకోవాలే ఉద్దేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అంతా అనుకుంటారు. ఆ విధంగా ప్రస్తుతానికి రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో ఓ గేమ్ ఆడుతున్నాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా నిర్మిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందే ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతుంది. పవన్ నిర్మాణ సంస్థ ఇటివలే ‘సర్దార్’ అనే టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించింది. అయితే, ఎప్పటి నుండో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలనే కోరికను రామ్ చరణ్ వ్యక్తం చేస్తున్నారు.

పవన్ – త్రివిక్రమ్ అత్యంత సన్నిహితులు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాబాయి నిర్మించే తొలి సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు అయితే బాగుంటుందని చరణ్ సూచించారంట. గతంలో త్రివిక్రమ్ కి దర్శకత్వంలో నటించాలని రామ్ చరణ్ ప్రపోజల్ పెడితే, త్రివిక్రమ్ బిజిగా ఉండటం వల్ల ఆ కాంబినేస్ సాధ్యపడలేదు.

ఇప్పుడు పవన్ అడగడంతో త్రివిక్రమ్ ఓకే చెప్పడం కచ్ఛితం. త్రివిక్రమ్ ని ఇరికించాలంటే ఇదే సరైన సమయం అనుకొని, పవన్ చేత త్రివిక్రమ్ కాంబినేషన్ కి రామ్ చరణ్ ఓకె చేయించాడు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. పవన్ నిర్మాత, త్రివిక్రమ్ దర్శకుడు, రామ్ చరణ్ హీరో.. ఈ కాంబినేషన్ సగటు సినీ అభిమానితో పాటు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి రేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: