టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్న హీరో ఎవరంటే, కచ్చితంగా జూ.ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తను సరైన సక్సెస్ చూసి చాలా కాలం అయింది. ఆ విధంగా ఎంతో కాలం తరువాత వచ్చిన బాక్సాపీస్ సక్సెస్ ఫుల్ మూవీ టెంపర్. దీంతో ఎన్టీఆర్ ఈ సక్సెస్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.

టెంపర్‌ చిత్రంలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న దయాగాడి పాత్రకు జీవం పోసిన ఎన్టీఆర్‌ ఈ చిత్రం ఘన విజయం సాధించటమే కాకుండా నటునిగా కూడ నటనకు అత్యున్నత ప్రశంసలు పొందుతుండటంతో, ఎన్టీఆర్న ధైర్యంగా మరో అడుగు ముందుకు వేయనున్నాడని సమాచారం.

త్వరలో వివిఎన్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కన్ను చిత్రంలో కూడ ఎన్టీఆర్‌ పూర్తి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను చేయనున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళితే, సుకుమార్ మొదట ఎన్టీఆర్ కి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ని డిజైన్ చేస్తే, దాన్ని మార్చమని సుకుమార్ పై ఒత్తిడి చేశాడు. ఇది టెంపర్ మూవీ రిలీజ్ కాకముందు.

టెంపర్ మూవీ రిలీజ్ అనంతరం, దాని సక్సెస్ ని చూసిన జూనియర్, తిరిగి సుకుమార్ వద్దకు వెళ్ళి, నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ నే ఉంచమని కోరాడట. దీంతో సుకుమార్ కొద్దిగా ఇరకాటంలో పడినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో అత్యుత్తమ నటనకు ఆస్కారం ఉన్న ఓ డైనమిక్‌ పాత్రను ఎన్టీఆర్‌ చేయనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: