ఐదు పదుల వయసులో కూడ అమ్మాయిలను ఆకర్షించే క్రేజీ హీరోగా బాలీవుడ్ బాదుషాగా షారుఖ్ ఖాన్ కొనసాగుతున్నాడు అంటే అతడి ఏ రేoజ్ లో ఇప్పటికి కూడా నిలిచాడో అర్ధం అవుతుంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఎన్నో సినిమాలు చేసి మరెన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఘనత షారుఖ్ సొంతం. లేటెస్ట్ గా మహిళల కోసం షారుఖ్ చేసిన ఒక ప్రయోగం మీడియాకు హాట్ టాపిక్.

ఒక ప్రముఖ హిందీ ఛానల్ ప్రసారం చేస్తున్న ‘ఇండియా పూఛే గా సబ్ సే షానా కౌన్’ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన షారుఖ్ ఖాన్ ఆ షోలో పాల్గొంటున్న మహిళలతో అనేక విషయాలు మాట్లాడాడు. ఆ తరువాత భారత స్త్రీలు ఎక్కువగా ఇష్టపడే చీర కట్టు గురించి వారి మాటలు మళ్ళాయి.

అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంత మంది మహిళలు షారుఖ్ ను చీర కట్టుకోమని బలవంతం చేసారు. దానికి షారుఖ్ తనకు చీర కట్టుకోవడం రాదు అని సమాధానం ఇచ్చినా ఆ కార్యక్రమానికి వచ్చిన మహిళలు అంగీకరించకుండా బలవంతంగా వారే షారుఖ్ చేత దగ్గర ఉండి చీర కట్టించారు.

ఈ అనుకోని సంఘటనకు మొదట్లో షారుఖ్ కొద్దిగా షాక్ అయినా తేరుకుని ఆ చీర కట్టు కోవడంలో మారిన తన లుక్ ను చూసుకుని ఆనంద పడ్డాడు. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా ప్రచారం కోసం దీపికా పదుకొనే తో గతంలో చీరతో ఇలా సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరమైనా షారుఖ్ కలలు కంటున్నా 600 కోట్ల కలెక్షన్స్ కల నెరవేరుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: