మెగా కుటుంబం నుంచి ఆరడుగుల బుల్లెట్ గా గత సంవత్సరం క్రిస్మస్ కు ‘ముకుంద’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా విజయవంతం కాకపోయినా నటుడుగా వరుణ్ తేజ్ కు మంచి మార్కులే వేయించింది. దీనితో ఈ సినిమా విజయంతో సంబంధం లేకుండా ఈ యంగ్ మెగా హీరోకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.

ఈనేపధ్యంలో వరుణ్ తేజ్ ఒక ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో కొన్ని ఆ శక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్ బెడ్ రూమ్ లో ఒక నిలువెత్తు ఫోటో ఉన్నదట. ఆ ఫోటోలో చిరంజీవి పవన్ కళ్యాణ్ లు వాళ్ళ కుటుంబంలో జరిగిన ఒక ఫంక్షన్ కోసం గతంలో కలిసి తీయించుకున్న ఫోటో అని చెపుతున్నాడు.

ప్రతి రోజు నిద్ర లేవగానే తాను కళ్ళు తెరచి ముందుగా ఆ ఫోటోను చూసిన తరువాత మాత్రమే తన దైనందిన కార్యక్రమాలను మొదలు వెడతాను అని చెపుతున్నాడు ఈ యంగ్ మెగా హీరో. తన జీవితంలో ఎప్పటికైనా తన పెద్ద నాన్న చిరంజీవి లా బాబాయి పవన్ లా ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మెప్పించాలని తన కోరిక అని చెప్పాడు వరుణ్ తేజ్.

తన తండ్రి నాగబాబు తనను దర్శకుడిగా మారమని ప్రోత్సహిస్తే తనకు మాత్రం హీరో కావాలానే కోరికతో తాను ఈ సినిమా రంగ ప్రవేశం చేసాను అని చేపుతున్నాడు. తన మొదటి సినిమా ‘ముకుంద’ చూసిన తరువాత తన పెదనాన్న చిరంజీవి తన భుజం తడుతూ తనను, పవన్ ను అనుసరించకుండా నీకంటూ నువ్వు ఒక ఒరిజినల్ స్టైల్ ని ఏర్పరుచుకున్నావు అని ఇచ్చిన కాంప్లిమెంట్ తనను ఎంతో సంతోష పెట్టింది అని మురిసి పోతున్నాడు ఈ మెగా యువ హీరో..

మరింత సమాచారం తెలుసుకోండి: