ఇంటర్నెట్ లో బూతు సినిమాలను రహస్యంగా చూస్తే లేని తప్పు సెన్సార్ ఒప్పుకున్న సృగార సినిమాలను చూడడానికి జనం ఎందుకు మొహమాట పడుతున్నారు అని పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రేక్షకులకు ఎదురు ప్రశ్నలు వేస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘కుచ్‌ కుచ్‌ లోచా హై' మూవీ ఒక సెక్స్ కామెడీ అని ఆ సినిమాను చక్కగా కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు అని తన సినిమాను చాల విభిన్నంగా ప్రమోట్ చేసుకుంటోంది సన్నీ.

రొమాంటిక్ మువీలలో వచ్చే శృంగార సన్నివేశాలను ఒక మంచి మెసేజ్ తో ఒక డిఫరెంట్ సెక్స్ కామెడీగా తాము తీసి ప్రయత్నిస్తున్న ఈ ‘కుచ్ కుచ్ లోదా హై’ సినిమా పై మీడియా ఎందుకు నెగిటివ్ వార్తలు వ్రాస్తోంది అంటూ సన్నీ మండి పడిపోతోంది.

తాను నటించిన 'కుచ్‌ కుచ్‌ లోచా హై' లో సెక్స్ కామెడీ ఎక్కువగా ఉంటుందని కామెడీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సెక్స్ కామెడీ సినిమాలను చూస్తే తప్పు ఏమిటీ అని మీడియా ముందు ప్రశ్నలు వేస్తున్న సన్నీ లియోన్ మాటలకు బాలీవుడ్ మీడియా మాటలు రాక షాక్ అవుతోంది అని టాక్.

సన్నీ మాటలతో భవిష్యత్ లో సెక్స్ కామెడీ సినిమాల పేర్లతో బూతు సినిమాలు బాలీవుడ్ ను షేక్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి. సన్నీ మాటలు కత్తికి రెండు వైపులా పదునే అని అనిపించేడట్లుగా ఉంటాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: