నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించ బోతున్న తుళ్ళూరు చుట్టూ పక్కల గ్రామాలలో పవన్ చేసిన సుడిగాలి పర్యటన విజయవంతమైనా అనేక శేష ప్రశ్నలను మిగిల్చింది. పవన్ చెప్పిన విషయాలను నిశితంగా పరిశీలించిన విశ్లేషకులు పవన్ చెప్పిన విషయాలలో ఎక్కడో ఒక చోట క్లారిటీ మిస్ అవుతోంది అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఒక టాలీవుడ్ ఎంపరర్ లా కాకుండా అతి సామాన్యమైన వ్యక్తిగా జనంలో కలిసి పోతూ పల్లెటూరి జనం రచ్చ బండ పై కూర్చుని మాట్లాడుకునే విధంగా పవన్ తన శైలిని ప్రదర్శించి మంచి మార్పులు కొట్టేసాడు అన్నది వాస్తవం.

అయితే ఇప్పటికే ఈ ప్రాంత గ్రామాలలో దాదాపు 90 శాతం మంది రైతులు తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇవ్వడానికి ఇస్టంగానో అయిష్టంగానో సంతకాలు పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నేపధ్యంలో ఆఖరి నిముషంలో పవన్ చేసిన పర్యటన దేనికి పనికి వస్తుంది అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

అదీకాకుండా ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడ తయారు అవుతున్న నేపద్యంలో కేవలం పవన్ వ్యక్త పరుస్తున్న అభిప్రాయాలను పరిగణంలోనికి తీసుకుని చంద్రబాబు తన రాజధాని నిర్మాణo యాక్షన్ ప్లాన్ ను మార్చుకుంటాడు అనుకోవడం తీరని ఆశే అవుతుంది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి స్పెషల్ స్టేటస్ రప్పించే విషయంలో ఢిల్లీ స్థాయిలో చేయవలసిన పోరాటాన్ని తుళ్ళూరు గ్రామప్రాంతాలలో పర్యటిస్తూ మైక్ లు అదిరిపోయేలా పవన్ అరిచినా పట్టించుకునే నాధుడు ఢిల్లీ స్థాయిలో లేడు అన్నది వాస్తవం.

రాజధాని నిర్మాణానికి సంబంధించి వేలాది ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటాను అని చంద్రబాబు ఎన్నో నెలల క్రితం ప్రకటించి డానికి తగ్గట్లుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చినప్పుడు రైతులు కోసం స్పందించని పవన్ ఈ ఆఖరి నిముషంలో సినిమా క్లైమాక్స్ సీన్ మాదిరిగా పవన్ నిన్న హడావిడిగా చేసిన ప్రయత్నం హిట్ అయిందా లేక ఫట్ అయిందా అన్న విషయంలో తలలు పండిన రాజకీయ వేత్తలకే సమాధానం లేని వంద శేష ప్రశ్నలను లేవనెత్తుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: