టాప్ హీరోలు తమ సినిమాలను హిట్ సినిమాలను తీసిన దర్శకుల సినిమాలలో నటించడానికి చాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈవిషయంలో చరణ్ తీరు విభిన్నం అనేమాటలు వినిపిస్తున్నాయి. దీనికికారణం చరణ్ గతంలో నటించిన సినిమాల లిస్టును పరిశీలిస్తే ఒక భయంకరమైన ఫ్లాప్ సినిమాకు దర్శకత్వం వహించిన తరువాత ఆ దర్శకుడి దర్శకత్వంలో నటించిన తదుపరి సినిమాలు చరణ్ కు కెరియర్ కు బాగాకలిసి వచ్చాయి.

గతంలో సంపత్ నంది ‘ఏమైంది ఈవేళ’ సినిమా తీసి ఫ్లాప్ ను మూటకట్టుకున్న తరువాత చరణ్ తనతో ‘రచ్చ’ సినిమా తీసే అవకాశం ఈదర్శకుడికి ఇచ్చాడు. అదేవిధంగా వినాయక్ కు హిట్స్ లేక బాధపడుతున్న సమయంలో ‘నాయక్’ సినిమా తీసే అవకాశం ఇచ్చాడు. ఈసినిమాలు రెండు కూడ భారీవిజయాలను నమోదు చేసుకున్నాయి.

ఆతరువాత చరణ్ కృష్ణవంశీ కి ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తీసే అవకాశం ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఈసినిమా సూపర్ హిట్ కాకపోయినా ఏవరేజ్ టాక్ తో చరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈసినిమా తరువాత నెలల కొద్ది గ్యాప్ తీసుకుని ఎంతోమంది దర్శకులు చరణ్ చుట్టూ తిరుగుతున్నా తిరిగి ‘ఆగడు’ లాంటి భారీ ఫ్లాప్ తీసిన శ్రీనువైట్లకు తాను ఇచ్చిన మాటప్రకారం అవకాశం ఇచ్చి తన ఫ్లాప్ సెంటిమెంట్ కొనసాగిస్తున్నాడు.

నిన్న ఈసినిమా ప్రారంభోత్సం అతి నిరాడంబరంగా జరిగింది. అయితే ఈసినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన కొందరు అతిధులు చరణ్ కు ఫ్లాప్ సెంటిమెంట్ కలిసి వస్తుందేమో అన్న సెటైర్లు వేసుకున్నట్లు టాక్. ఈసినిమాని త్వరగా పూర్తి చేసి ఈసంవత్సరం దసరాకు విడుదల చేయాలనే పట్టుదలలో ఉన్న చరణ్ కు ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ఎంతవరకు సక్సస్ ను ఇస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: