మెగాస్టార్ చిరంజీవిని కుటుంబ సభ్యులు సర్ ప్రైజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన విషయాలు చిరంజీవికి తప్పితే, మిగతా అందరికి తెలుసంట. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం 59 వయసులో ఉన్న చిరంజీవి ఆగస్టు 22 నాటికి 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి దంపతుల షష్టిపూర్తి ఘనంగా నిర్వహించాలని మెగా ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం షష్టి పూర్తి చేయాలా? వద్దా? సందేహం ఉన్న మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఓ క్లారిటీకి వచ్చారంట. కచ్చితంగా ఫంక్షన్ ని చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారంట.

దీనికి సంబంధించిన న్యూస్ సైతం ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లారిటీగా వినిపిస్తుంది. రామ్ చరణ్, నాగబాబు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటారని తెలుస్తోంది. మరో 5 నెలలకి పైగా సమయం ఉండటంతో ఇప్పటి నుండే పర్ ఫెక్ట్ ప్లానింగ్ తయారు చేసుకోవాలని భావిస్తున్నారు.

బంధువులు, ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుక వివాహ మహోత్సవాన్ని తలపించేలా ఉంటుందని అంటున్నారు. ముహూర్తం, పరిస్థితులు అనుకూలిస్తే బర్త్ డే, షష్టి పూర్తి ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: