ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో టెంపర్ మూవీ హాట్ టాపిక్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా ‘టెంపర్’కు విడుదలైన తొలిరోజు నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘టెంపర్’తో అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగే హిట్ కొట్టారు ఎన్టీఆర్. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇదిలా ఉంటే నైజాంలో దాదాపు 11 కోట్ల షేర్ వసూలు చేసింది.

విడుదలైన 20 రోజుల తర్వాత కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాదిస్తుంది. ఇన్ని గుడ్ టాక్స్ వినిపిస్తున్నప్పటికీ, ఈ మూవీ 50 కోట్ల రూపాయలను కలెక్షన్స్ ని కలెక్ట్ చేసిందా? లేదా? అనే న్యూస్ మాత్రం బయటకు రావటం లేదు. వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ క్యారేక్టరైజేషన్.. పూరి టేకింగ్, డైలాగ్స్.. కాజల్ గ్లామర్.. క్లైమాక్స్ ఎపిసోడ్.. సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవటంతో టెంపర్ మూవీ బాక్సాపీస్ మూవీగా మారింది.

ఇప్పటి వరకూ, ఈ చిత్రం 40 కోట్ల కలెక్షన్ మార్కు దాటింది. అయితే, టెంపర్ 50 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంతా ఆశించారు. కానీ, పరిస్థితి చూస్తుంటే 50 కోట్ల టార్గెట్ రీచ్ అవడం కష్టమే అంటున్నారు.

40 కోట్ల క్లబ్ లో ఈజీగా జాయిన్ అయిన టెంపర్, ఆ తరువాత నుండి కలెక్షన్స్ నెమ్మదిగా వెళుతున్నాయి. మరో వారం తరువాత వచ్చే బాక్సాపీస్ రిపోర్ట్ ని చూస్తే కాని, టెంపర్ 50 కోట్ల క్లబ్ లో ఉంటుందా? లేదా? అనేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: