ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో యువ హీరోల ప్లోటింగ్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో సిని నిర్మాతలు, దర్శకులు, హీరోల వారసులు ఎక్కువుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావటానికే ఆసక్తి చూపుతున్నారు. అందుకే గత రెండు, మూడు సంవత్సరాల నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన డెబ్యూ హీరోలు ఎక్కవుగా ఉన్నారు.

ఇక వీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తరవాత స్టార్ డం కోసం పడే తిప్పలు అంతా ఇంతా కాదు. ఏదేమైనా అందరూ కష్టపడే తత్వం ఉన్నవారే. ఇదిలా ఉంటే, టాలీవుడ్ కి చెంది ఓ యంగ్, మహేష్ బాబు అప్ కమింగ్ మూవీలో ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండానే నటిస్తున్నాడు. దీంతో ఆ హీరోకి సంబంధించిన న్యూస్, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెలితే, సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ఓ యువ హీరో కీలక పాత్ర పోషించనున్నారు. ‘అందాల రాక్షసి’, ‘అలా ఎలా’ చిత్రాల ఫేం రాహుల్ రవీంద్రన్ మహేశ్ సినిమాలో నటించనున్నారు. సినిమాలో కీలకమైన ఓ పాత్రకు రాహుల్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కొరటాల శివే ట్విట్టర్ ద్వారా తెలిపారు.

యువహీరో, ప్రతిభా శాలి రాహుల్ రవీంద్రన్ తమ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సినిమాలోని ఓ కీలక పాత్రలో మహేశ్ సరసన ఆయన నటించనున్నారని తెలిపారు. మైత్రి మూవీస్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: