అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ చేత రకరకాల సందర్భాలలో రకరకాల వేషాలు వేయిస్తూ ఇప్పటి నుంచే తన కొడుకును నటుడిగా తీర్చి దిద్దుతున్నాడు. గత సంవత్సరం చాచా నెహ్రుగా అందర్నీ అలరించిన అయాన్ వేలంటైన్స్ డేకి స్పెషల్ ఫోటో షూట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.

ఇది చాలదు అన్నట్లుగా ఈరోజు జరుగుతున్న హోలీ పండుగకు కూడా రెడీ అయి ఇలా రంగుల మధ్య కూర్చుని ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. ముద్దుముద్దుగా ముద్దులొలికే అయాన్ ఇలా డిఫరెంట్ లుక్ లో కనిపించడం బన్నీ అభిమానులకే కాదు ఎవరికైనా ముచ్చటేస్తుంది.

ఈ వార్తలు ఇలా ఉండగా అల్లుఅర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో ఫంక్షన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. బన్నీ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుక ఈనెల 8వ తారీఖున హైదరాబాద్ లో ఘనంగా జరగబోతోంది.

ఈ ఆడియో వేడుకకు పవన్ అతిథి గా రాబోతూ ఉండటంతో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ క్రేజ్ మరింత పెరిగి పోయింది. గత సంవత్సరం ‘రేసు గుర్రం’ తో సూపర్ హిట్ కొట్టిన బన్నీ అదే స్పీడ్ ను కొనసాగించాలని ఈ సినిమా విజయం పై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ బాదుషా షారుఖ్ తన చిన్న కొడుకు అబ్రామ్ ను తెరపై చూపించి హడావిడి చేసినట్లుగా బన్నీ కూడా త్వరలో తన కొడుకు అయాన్ ను వెండి తెర పై చూపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: