పవన్ కళ్యాణ్ తన దూకుడును హోలీ పండుగ రోజున కూడా కోన సాగించ బోతున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి. నిన్న తుళ్ళూరు ప్రాంత గ్రామాలలో పర్యటన చేసి ఆ పర్యటన ముగించుకుని వచ్చిన పవన్ ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా మరో సంచలనం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈరోజు పవన్ ప్రెస్ మీట్ పెట్ట బోతున్నట్లుగా కొన్ని మీడియా వర్గాలలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయానికి సంబంధించి ఇంకా స్పష్టమైన క్లారిటీ లేదు. నిన్న పవన్ వ్యాఖ్యల పై కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు మాటలకు సమాధానం ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ పవన్ పెడుతున్నాడా? లేదా తన వాదనలను జాతీయమీడియా దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాడా? అన్న విషయంలో రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి.

ఏది ఎలా ఉన్నా ఈ ప్రెస్ మీట్ వార్తలు మటుకు రాజకీయాలను ఇంకా వేడిక్కిస్తాయి అన్నది వాస్తవం. ఇప్పటికే లెట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్లు రాజధాని విషయంలో హడావిడి చేస్తున్న పవన్ ఈ ప్రెస్ మీట్ లో కొత్త విషయాలు ఏమి మాట్లాడుతాడు అన్న ఆ శక్తి అందరిలోనూ పెరిగి పోతోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీని కార్నర్ చేయడానికి కొందరు రచించిన వ్యూహాత్మక ఎత్తుగడలో పవన్ పావుగా అయిపోతున్నాడు అన్న వార్తలు కుడా వినిపిస్తున్నాయి. వరస పెట్టి సినిమాలు చేయవలసిన పరిస్థుతులలో సినిమాలు వదులుకుని ఇలా హఠాత్ గా యూటర్న్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచే విషయంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: