హాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి హాట్ భామ ఎమీ జాక్సన్. ఇటీవల 'ఐ' చిత్రంలో నటించిన తన గ్లామర్ తో అందరి మదిని దోచుకున్న అందాల తార. ప్రస్తతం తిరుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఈ అందాల భామ నటిస్తుంది.

ఈ షూటింగ్ కేరళ లో ఓ పెద్ద కొండల మధ్య జరగుతుంది. చిత్రీకరణలో భాగంగా కొండపై బైక్ రైడింగ్ సీన్ లో నటిస్తున్న ఎమీ ఒక్కసారిగా బైక్ పై నుంచి జారిపడి కొండమీద నుంచి కిందపడబోయిందట. అదృష్టం కొద్ది ఆమె వెనకాలే కమెడియన్ కరుణాకరన్ ఉండటం తో అతడు ఎమి జాక్సన్ లోయలో పడకుండా ఒడిసి పట్టుకుని ఆమె ప్రాణాలు కాపాడాడు.

దాంతో ఎమి జాక్సన్ కొద్దిలో ప్రాణాలు పోయేవి అంటూ షాక్ నుండి తేరుకుంది. దీంతో హాస్య నటుడిగా కనిపించే కరుణాకరన్ నిజ జీవితంలో అసలైన హీరోగా మారిపోయారు. పెద్ద సాహసమే చేసి అందాల ఎమీజాక్సన్ ప్రాణాలు నిపిపాడు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: