తెలుగు ఇండస్ట్రీలో పెను సంచలనాకు నాంది పలికిన చిత్రం ‘మగధీర’. రాంచరణ్ హీరోగా దర్శకుడు రాజమౌళి కాంబి నేషన్ లో వచ్చిన సినిమా తెలుగు నాట మంచి రికార్డులు నెలకొల్పింది. రాంచరణ్ జీవితంలో మరిచిపోలేని సినిమా ఇది... అంతే కాదు ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో వెరైటీగా ఉంటుంది.

ఫ్యాంటసీ సినిమా అయినా ఈ చిత్రం కథా కథనం చాలా బాగుంది. ఈ సినిమాలో డైలాగులకు మంచి పేరు వచ్చింది రాంచరణ్ కు.. ‘ఒక్కక్కరిని కాదు షేర్ ఖాన్.. వందమందిని ఒకే సారి రమ్మను’ ఈ డైలాగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే..

అయితే ఇదే డైలాగును గుక్కతిప్పుకోకుండా భలే చెప్పాడు ఓ చిన్నోడు. ఆ బుడ్డోడి వీడియోను యూట్యూబ్, ఫేస్ బుక్ లో పెట్టారు. మొత్తానికి ఈ వీడియోను ఇటీవల రాంచరణ్ చూశాడు. ఆ బాలుడి డైలాగులకు చాలా ఇంప్రస్ అయ్యాడు.

అంతే కాదు పిల్లాడు చూస్తే పిట్ట కొంచెం కూత ఘనంగా ఉంది. వీడిలో టాలెంట బాగా ఉంది. వెంటనే ఆ బాలుడిని కలవాలనుందని.. తన దగ్గరకు తీసుకురండని ఫేస్ బుక్ లో స్నేహితులకు మెసేజ్ పోస్ట్ చేశాడు. అదండి సంగతి మొత్తానికి మగధీరను బుట్టలో పడేశాడు బుడ్డోడు.

మరింత సమాచారం తెలుసుకోండి: