హీరోయిన్ సరిత గుర్తుందా.. మరో చరిత్ర సినిమా ద్వారా తెలుగు తెరకు బాలచందర్ పరిచయం చేసిన హీరోయిన్.. ఇప్పుడు గుర్తొచ్చిందా.. కమల్ హాసన్ జంటగా నటించిన ఆ ఒక్క సినిమాతోనే పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుందామె. అప్పట్లోనే టైట్ టాప్స్, ప్యాంట్స్ తో అదరగొట్టి అబ్బో అనిపించింది. ప్రస్తుతం అమ్మ, అత్త పాత్రలు చేస్తున్న సరిత.. అర్జున్ సినిమాలో మహేశ్ కు అత్తగా నటించి మెప్పించారు.

మరో చరిత్ర సినిమాలో ప్రేమలో విఫలమైన సరిత.. నిజ జీవితంలో పెళ్లిలో విఫలమైంది. మళయాళ నటుడు ముకేషన్ ను ఆమె పెళ్లాడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా. చాలామంది నటీనటుల పెళ్లిళ్లలాగానే సరిత పెళ్లి కూడా ఫెయిలైంది. ఈ జంట మధ్య విభేదాలు పొడచూపాయి.

ముకేషన్ సరిత నుంచి విడాకులు తీసుకున్నాడు. మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి అయిన చానాళ్లకు ఇప్పుడు సరిత ముకేషన్ పెళ్లి చెల్లదంటూ కోర్టుకెక్కారు. తనకు విడాకుల పత్రాలు అందలేదని కొత్త వాదన వినిపించారు. అందువల్ల ఈ విడాకుల చెల్లవని వాదిస్తున్నారు.

ముకేష్ రెండో పెళ్లి చట్ట సమ్మతం కాదంటూ సరిత కోచ్చిన్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు వచ్చిన సరిత.. వాదనల సమయంలో.. కోర్టులోనే స్పృహ తప్పి పడిపోయింది. సినిమా ఘటనను పోలిన ఈ ఉదంతం ఇప్పుడు ఇండస్ట్ర్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: