ఈమధ్య గ్లామర్ హీరోయిన్స్ ఫోటోలను మార్ఫింగ్ చేసి వెబ్ మీడియాలో రకరకాల అశ్లీల విడియోలు పెట్టి సంచలనాలు సృస్టించడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ బాధితుల లిస్టులోకి రీసెంట్ గా కోలీవుడ్ బ్యూటీ హన్సిక కూడా బాదితురాలిగా మారిన విషయం తెలిసిందే.

ఈ విషయం పై ఈరోజు జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక చాల ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ మార్ఫింగ్ ఫోటోల సంఘటనలపై హన్సిక స్పందిస్తూ ‘మహిళలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో మార్ఫింగ్ చేసి అభ్యంతరకరంగా ప్రవర్తించడం లాంటి చర్యలు రేప్ చేయడం కంటే దారుణమైనవి ' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హన్సిక.

అంతేకాదు ఇటువంటి వారిని శిక్షంచ వలసిన బాధ్యత అందరి పైనా ఉంది అని అంటూ కామెంట్స్ చేసింది హన్సిక. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ సినిమా తారలు 365 రోజులు విలాసంగా జీవిస్తూ ఉంటారని చాలామంది అభిప్రాయం అని చెపుతూ తాము ఎంత కష్టపడతామో చాలామందికి తెలియదు అని కామెంట్స్ చేసింది ఈ కోలీవుడ్ బ్యూటీ.

ఈ విషయంలో పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్న విషయం పై స్పందిస్తూ ఆ విడియోలో ఉంది తాను కాదని తనకు తెలిసినప్పుడు తాను ఎందుకు ఖంగారు పడాలి అని అంటూ తనను మానసిక క్షోభకు గురిచేసిన వారిని ఆ దేవుడే శిక్షిస్తాడు అని ఈ విషయాన్ని ఆ దేవుడికే వదిలేసింది హన్సిక..

మరింత సమాచారం తెలుసుకోండి: