రానా నటిస్తున్న కృష్ణం వందే జగద్గురం ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకుంది. అయితే, అదేమంత సంతోషంగా చెప్పుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే... సుమారు 20 నిమిషాల సినిమాకు సెన్సార్ వాళ్లు చల్లగా కత్తెర వేసేశారట. ఈ సినిమా బళ్లారి నేపథ్యంలో జరుగుతుంది. అక్కడ మైనింగ్ మాఫియా ఇందులోని ప్రధాన ప్రతినాయకుడు. నిజానికి బళ్లారి మైనింగ్ మాఫియాకూ, దివంగత రాజశేఖరరెడ్డికీ అవినాభావ సంబంధం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి, నిజాన్ని ఎలా చెప్పకుండా ఉండగలరు సినిమాలో. అందుకే, వైయస్సార్ మీదా, ఆ పార్టీ మీదా కొన్ని డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయట. అవన్నీ బయటకు వస్తే ఎంత గొడవ జరుగుతుందో సెన్సార్ వాళ్లు ముందే ఊహించి వాటికి కత్తెర వేసేశారట. ఎందుకు వేయరూ... ఇప్పటికే రాంబాబు, దేనికైనా రెడీ వాళ్లకు మంచి పాఠాలే నేర్పించాయి కదా. 

మరింత సమాచారం తెలుసుకోండి: