సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ తమన్నా, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మార్చి 2005లో తన మొదటి హందీ మూవీతో ఎంట్రి ఇచ్చిన తమన్న, 2015 మార్చికి దశాబ్ధకాలం సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న తమన్నా తెలుగులో బాహుబలి మరియు బెంగాల్ టైగర్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఓ హిందీ మూవీలోనూ నటిస్తుంది. బాహుబలి సినిమాకి ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేస్తే, బెంగాల్ టైగర్ కి ఇటీవలే షూటింగ్ మొదలైంది.

ఈ భామని మీ 10 ఏళ్ళ హీరోయిన్ కెరీర్ సంతృప్తి కరంగా ఉందా అని అడిగితే ‘నాకెప్పుడు అసంతృప్తి లేదు. పది మందికి గర్వంగా నేను ఈ సినిమాలు చేసానని చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు ఉన్నాయి.కేవలం సక్సెస్ అనే టార్గెట్ పెట్టుకొని నేనెప్పుడు సినిమాలు చేయలేదు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పించాలి, కొత్తగా కనిపించాలనే సినిమాలు చేసాను.

నా పదేళ్ళ సినీ ప్రయాణం నాకు చెప్పలేనంత ఆనందం ఇస్తుందని’ తమన్నా అంటోంది. ఇదిలా ఉంటే, ఈ బ్యూటీ ఇప్పటి వరకూ 35 చిత్రాలలో నటించింది. వాటిలో దాదాపు 15 చిత్రాలను ఘోరమై ప్లాపులను చూశాయి. మిగతా చిత్రాలు తనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. తెలుగులో 2005వ సంవత్సరంలో శ్రీ మూవీతో ఈ బ్యూటీ అడుగుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: