తెలుగు సినీ పరిశ్రమలోకి అనుష్క అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తయ్యాయి. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న తెలివితేటలు ఇంకా రాకుండా ఎలా ఉంటాయి. అందుకే, ముందుచూపుతో వ్యవహరించాలని నిర్ణయించుకుందట. దర్శకులో, నిర్మాతలో తనకు అవకాశమిచ్చామని బిల్డప్ ఇవ్వడమేంటి... రోజురోజుకీ వయసు పెరిగిపోతోందనీ... సీనియర్ నటిని అయిపోతున్నాననీ రెమ్యునరేషన్ తగ్గించడమేంటీ... అనుకుందట. అందుకే, వాళ్లకు ఆ అవకాశం తనే ఇవ్వాలనుకుంటోందట. వాళ్లకు తాను అవకాశమివ్వాలంటే... తనది తీసుకునే చెయ్యి కాకూడదు, ఇచ్చే చెయ్యిగా ఉండాలని అర్థం చేసుకుంది. అందుకే, నిర్మాత అవతారమెత్తబోతోంది. ఇక, అప్పుడు ఎవ్వరినీ బతిమాలాల్సిన అవసరం లేదు కదా. ఇందుకోసం మిత్రుడు శింబును సంప్రదించిందట. శింబు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడట. ఇలా ఒకే ఆలోచన ఉన్నవాళ్లందరినీ ఓ చోట చేర్చి ఓ నిర్మాణ సంస్థ నిర్మంచాలన్నది వీళ్ల ఆలోచనట. 

మరింత సమాచారం తెలుసుకోండి: