మంచి రోమియో అయివుండాలి. రోమియో జూలియట్‌ కథ అందుకు నిదర్శనం. ఎవరైనా ప్రేమిస్తే అలా వుండాలి. నాకు వారి కథ అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ఎందరో రోమియోలను చూశాను. కానీ వారెవ్వరూ నిజమైన రోమియోలుకాదు. అంటూ.. నటి హన్సిక తెలియజేస్తుంది. తమిళంలో ఆమె రోమియోజూలియట్‌ కథతో సినిమా చేస్తుంది.

జయంరవి హీరో... అందులో నాకు నచ్చినట్లుగా కథ వుంది. ప్రేమించే సన్నివేశాల్లో ఫీల్‌ వుంది అని చెబుతోంది. నిజజీవితంలో ప్రేమించడానికి అలాంటి వ్యక్తి దొరకలేదు. మనిషికి చూడగానే ఆయన మనసు తెలుసుకోలేం. అందుకే ఇంకా ఎవరిపై ప్రేమకలగలేదని చెబుతోంది. ప్రేమిస్తే రోమియోలాంటి నిజమైన ప్రేమికుడు అనిపిస్తే తప్పకుండా పెండ్లిచేసుకుంటాననంటోంది... మరి ఆ రోమియో ఎక్కడున్నాడో..?

. .

. .

మరింత సమాచారం తెలుసుకోండి: