భారీ తారాగణంతో రూపొందించిన వర్ణ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ సెల్వరాఘవన్ తదుపరి సినిమా ఇప్పటివరకూ ఆరంభమవ్వలేదు. త్వరలో ఓ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

కాకపోతే ఈ చిత్రాన్ని సెల్వరాఘవన్ సోదరుడు ధనుష్ నిర్మించనున్నాడు. కోలీవుడ్ లో వివాదాస్పద హీరో అని చెప్పగానే గుర్తొచ్చేది శింబు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శింబు చిన్న నాటి నుంచి ఒక రకమైన మ్యానరిజం తో ఉండేవాడు.

స్టయిల్ గా లిటిల్ స్టార్ అనే పేరు అప్పుడే వచ్చింది. మరి మనోడికి ఒకటా రెండా… ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటాడు. ఇతగాడి సరసన నటించాలంటే హీరోయిన్లు సైతం వెనకడుగు వేస్తుంటారు. అలాంటిది ఈ హీరోతో రొమాన్స్ చేయడానికి దీక్షాసేధ్ అంగీకరించిచేసింది.

తెలుగు, తమిళంలో సినిమాలు చేసినప్పటికీ, అవి ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోవడంతో దీక్షా కెరియర్ ప్రశార్ధకంగా మారింది. హిందీలో ఒకటి, అరా అవకాశం వస్తోంటే చేస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ లో శింబు సరసన నటించే అవకాశం రావడంతో దీక్షా ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుని సౌత్ లో నిలదొక్కుకోవాలని భావిస్తోందట. మొత్తానికి శింబు ఏ మత్తు చల్లాడో మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: