తమిళ సినిమా వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. బాల నటుడిగా సినీ రంగంలో ప్రవేశించిన శింబు చిన్నప్పుడే లిటిల్ సూపర్ స్టార్ గా పిలిపించుకున్నాడు. హీరోగా నటించడం మొదలు పెట్టినప్పటి నుంచి మనోడు వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచాడు.

గతంలో నయన తార లిప్ లాక్ చేస్తూ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేశాయి. తర్వాత హన్సికను ప్రేమించి పెళ్లి దాకా వచ్చి ఆగిపోయింది. అలాంటి హీరో కన్నీరు పెట్టుకున్నాడు కారణం శింబు కన్నీరు అతనిపై కుట్ర జరుగుతుందని అంటున్నాడు.

పరిశ్రమలో తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని సోషల్ సైట్ లో తన అభిమానులతో చెప్పుకొని ఆవేదన చెందుతున్నాడు. ఆ కుట్ర వెను ఎవరూ అన్న విషయం చెప్పకపోయినా చిత్ర పరిశ్రమలోని తన ఎదుగుదలను ఆపుతున్నారంటూ వాపోయాడు. గత రెండేళ్లుగా అతను ఓ సినిమా చేస్తూనే ఉన్నాడు. ఆ సినిమా ఎట్టకేలకు ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది.

త్వరలో విడుదల అవడం ఖాయం అంటున్న సమయంలో ఆ సినిమా ఆగిపోయింది. దాంతో శింబు ఈ కామెంట్స్ చేస్తున్నాడని పరిశ్రమలో గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం గౌతం మీనన్ , సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు శింబు.

మరింత సమాచారం తెలుసుకోండి: