మహేష్‌బాబు - కొరటాల శివ లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ గురించి బయటకు వస్తున్న ఒక న్యూస్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమాను జూలై 17న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ న్యూస్ మహేష్ అభిమానులకు షాకింగ్ గా మారింది అని అంటున్నారు. దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా మహేష్ సినిమాలు అన్నీ దసరా పండుగను కాని లేదా సంక్రాంతిని కాని లేదంటే సమ్మర్ సీజన్ ను కాని టార్గెట్ చేసుకుంటూ విడుదల అవుతూ వచ్చాయి.

అయితే ఎటువంటి సెలవులు లేని జూలై నెలలో మహేష్ ‘శ్రీమంతుడు’ విడుదల కావడం ఏమిటీ అని మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు టాక్. అయితే ఈ నిర్ణయం వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈసారి టాలీవుడ్ సమ్మర్ రేస్ టాప్ హీరోల సినిమాల మధ్య జూదంగా మారిపోవడంతో ఇప్పటికే రెండు వరస పరాజయాలు చూసిన మహేష్ మరో ప్రయోగం చేసి విఫలం అవడం ఇష్టంలేక సమ్మర్ రేస్ పూర్తిగా అయిపోయిన తరువాత తీరికగా రావడానికి ఈ జూలై నేలను ఎంచుకున్నాడు అనే వార్తలు కూడా ఉన్నాయి.

దీనికి తోడు మరొక ఆ శక్తికర సెంటిమెంట్ కూడా మహేష్ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది అని అంటున్నారు. ఎటువంటి పండుగల నేపధ్యం లేకుండా గతంలో విడుదలైన ‘మగధీర’, ‘ఇంద్ర’, ‘సింహాద్రి’ లాంటి సినిమాలు జూలై నెలలో విడుదలై బ్లాక్ బస్టర్స్ గా మారిన నేపధ్యంలో ఈసారి మహేష్ ఎటువంటి పండుగలు సెలవులు లేని జూలై నెలను తన ‘శ్రీమంతుడు’ కు సెంటిమెంట్ గా మార్చుకున్నాడు అనే వాదన కూడ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ 8.1 కోట్లకు సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో సాధారణ సీజన్ లో కూడా తన కలక్షన్స్ రేంజ్ ఏమిటో చూపెట్టడానికి మహేష్ ఈ సాహసం చేస్తున్నాడు అని అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: