తెలుగు, తమిళ చిత్ర రంగంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మహానటి సావిత్రి. హావభావాలను పలికించాలంటే ఆమె తర్వాతే ఎవరైనా.. తెలుగు, తమిళ అగ్ర హీరోల సరసన పోటా పోటీగా నటించి షహబాష్ అనిపించుకున్న ఉత్తమ నటి. తెలుగు సినీ ప్రపంచం లో మహానటి కొమ్మారెడ్డి సావిత్రి (1936 డిసెంబర్ 6 - 1981 డిసెంబర్ 26) .


సావిత్రి 13 సంవత్సరాలవయసులో ఉన్నసమయంలో కాకినాడలోని ఆంధ్రనాటక పరిషత్ నిర్వహించిన నృత్యనాటక పోటీలలో ఆనాటి ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు, హిందీ సినీరంగంలో ప్రసిద్ధుడు అయిన పృధ్వీరాజకపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నది. అది ఆమెలో కళలపట్ల ఆరాధన పెరగడానికి కారణమైంది. 


ఆమె 1949లో చలచిత్రాలలో నటించడానికి మద్రాసు నగరంలో ప్రవేశించింది. తెలుగు తమిళ సినిమాల్లో కూడా నటించి, మహానటి అనిపించుకుని, తరాల తరువాత కూడా ఆరాధింపబడుతూంది. ఈమె కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించింది. అంతే కాదు మహానటి సావిత్రకి బొమ్మలు వేయడం అంటే మహా సరదా. తీరిక దొరికినప్పుడల్లా చక్కటి బొమ్మలు వేసి తన ఫ్రెండ్స్ కి చూపించేదట.  


మరింత సమాచారం తెలుసుకోండి: