క్యూట్ బ్యూటీ సమంత సిద్ధార్థ్ తో లవ్ బ్రేకప్ చేసుకున్న తరువాత ఆమె పై హాట్ న్యూస్ లు ఏమి రాలేదు. అయితే సమంత చెన్నైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపార వేత్తతో చాల సన్నిహితంగా మేలుగుతోంది అంటూ కోలీవుడ్ మీడియా గాసిప్పుల హడావిడి చేస్తోంది. అంతేకాదు ఈమె ప్రస్తుతం ఆ పారిశ్రామిక వేత్తతో సహజీవనం కూడ చేస్తోంది అంటూ కొన్ని మీడియా వర్గాలలో గాసిప్పులు వస్తున్నాయి. 

ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా మీడియా వర్గాలలో వస్తున్న ఈ వార్తలు చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే త్రిష చెన్నైకి చెందిన ఒక పారిశ్రామిక వేత్తతో పెళ్ళికి రెడీ అవుతున్న నేపధ్యంలో త్రిషను ఆదర్శంగా తీసుకుని సమంత కూడా ఇలా వ్యాపారవేత్త బాట పట్టిందా అన్న అనుమానం కలగడం సర్వసాధారణం. 

సమంత ప్రస్తుతం నటిస్తున్న కోలీవుడ్ సినిమా '10 ఎనరదుకుళ్' షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం నేపాల్ దేశాన్ని చుట్టేస్తూ అక్కడి ప్రకృతికి పరవసించి పోవడమే కాకుండా రకరకాల వెరైటీ వస్తువులను నేపాల్ లో కొంటూ బిజీగా ఉన్నదట..



మరింత సమాచారం తెలుసుకోండి: