టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా మారిన అంశం    ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష పదవి. 2013-15 వరకూ మురళీమోహన్ మా అధ్యక్షుడిగా  బాధ్యతలు కొనసాగిస్తుండగా ఈ సారి పోటీలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

రాజకీయాలకు అతీతంగా అంటూనే ఈ పోటీ రసవత్తర రాజకీయం అయ్యింది.  నిజానికి  రాజేంద్రప్రసాద్ ఏక గ్రీవంగా ఎన్నికవుతారని అందరూ భావించారు. కానీ సహజనటి మాజీ ఎమ్మెల్యే జయసుధ రంగంలోకి దిగింది. దాంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ తప్పలేదు. ఈ నెల 29న ‘మా’ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. 

మోడలింగ్, యాక్టింగ్,దర్శకత్వం,నిర్మాతగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మంచు లక్ష్మి


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి మాత్రం ఏ డోకా లేదు ప్రశాంతంగా ఎన్నుకున్నారు.  శివకృష్ణ, మంచు లక్ష్మీ ప్రసన్న ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. మా కార్యనిర్వహక ఉపాధ్యక్షుడుగా తనికెళ్ళ భరణి, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా, కార్యదర్శిగా ఆలీ ఎన్నికయ్యారు.


తండ్రి మంచు మోహన్ బాబుతో మంచు లక్ష్మి


గతంలో మురళీ మోహన్ ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యింది  కానీ ఈసారి ఇందుకు భిన్నంగా ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ నెలకొంది. మురళీమోహన్ సపోర్ట్ తో జయసుధ బరిలోకి దిగితే, రాజేంద్రప్రసాద్ ని మెగాబద్రర్ నాగబాబు సపోర్ట్ చేస్తున్నారు. దాంతో పోటీ రసవత్తరంగా మారింది. ఈ పోటీలో గెలిచి ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టబోతోంది ఎవరో?


మరింత సమాచారం తెలుసుకోండి: