టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిన‌ యాగంకంటికి క‌నిపించ‌ని అమేయ‌మైన శ‌క్తికి ఎవ‌రికి వారు త‌మ‌కు తోచించి చెప్పుకుంటారు. కొంద‌రు దేవుడంటే.. మరికొంద‌రు ప్ర‌కృతి అంటారు. ఏది ఏమైనా న‌మ్మ‌కంతో చేసే ఏ పని అయినా అందుకు త‌గ్గ ఫ‌లితం వ‌స్తుంద‌ని న‌మ్ముతుంటారు. ఈ మ‌ధ్య‌న తెలుగు చ‌ల‌న‌ చిత్ర‌రంగ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా మృత్యువాత ప‌డ‌టం.. దీనిపై ఎంపీ ముర‌ళీమోహ‌న్ మాట్లాడుతూ.. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ఏదో గాలి ప‌ట్టుకుంద‌ని వ్యాఖ్యానించ‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.


ఏదో బాధ‌లో అలాంటి మాట ముర‌ళీమోహ‌న్ నోటి నుంచి వ‌చ్చింద‌ని భావించారు. కానీ.. ఆయ‌న తాను చెప్పిన మాట‌కు త‌గ్గ‌ట్లే.. మృత్యుంజ‌య యాగాన్ని మొద‌లు పెట్టారు. ఈ యాగం ఒక‌విధ‌మైన చ‌ర్చ‌ను తెర తీస్తే.. ఈ యాగంపై ప‌లు ర‌కాలు కామెంట్లు రావ‌టంతో ఇప్పుడీ యాగం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఈ యాగానికి సంబంధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అంశం.. ఈ యాగాన్ని జ‌రిపిస్తున్న స్వాములోరు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును ఏదో ఒక దానిపై తిట్టిపోసే విశాఖ‌కు చెందిన స్వ‌రూపానంద స్వామీజీ చేత యాగాన్ని జ‌రిపించ‌టం. త‌మ అధినేత‌ను తిట్టిపోసే స్వాములోరిని ఎన్నుకోవ‌టం ఏమిట‌ని ముర‌ళీమోహ‌న్ నిర్ణ‌యాన్ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మ‌రోవైపు ఈ యాగం మొద‌లైనప్ప‌టికి నుంచి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వార్త‌ల్లోకి రావ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


 యాగం ప్రారంభం కాగానే.. టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో నాగార్జున అండ్ కో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయార‌ని.. అన్న‌పూర్ణ స్టూడియోకు చెందిన ఏడున్న‌ర ఎక‌రాల భూమిని రెండు బ్యాంకులు స్వాధీనం చేసుకున్న వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు బొగ్గు కుంభ‌కోణంలో తెలుగు సినిమా పెద్ద దిక్కుగా చెప్పుకునే దాస‌రి నారాయ‌ణ రావు ఆస్తుల‌ను ఈడీ జ‌ఫ్తు చేస్తుంద‌న్న వార్త‌లు రావ‌టం గ‌మ‌నార్హం.వాస్త‌వానికి యాగానికి.. వీటికి ఏమాత్రం సంబంధం లేక‌పోవ‌చ్చు. కానీ.. స‌రిగ్గా యాగం జ‌రిగే స‌మ‌యంలోనే.. ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌టాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: