మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వెండితెరపై చూసి చాలా రోజులైంది కాదు సంవత్సరాలు గడిచాయి. స్టాలిన్ సినిమా తర్వాత చిరంజీవి మళ్లీ మోఖానికి రంగు వేసుకోలేదు. ఆ మధ్య మగదీర  సినిమలో తనయుని కోసం ఒక్క పాటలో ఇలా కనపడి అలా వెళ్లి పోతాడు.


రాంచరణ్ బంగారు కోడిపెట్ట సాంగ్


చిరంజీవి తెరపై కనపడితే చూసి సంతోషించాలని ఎవరిక ఉండదు. కానీ ఆ అదృష్టం ఎప్పుడు కల్పిస్తారా అని కొండత ఆశతో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. మరి  చిరంజీవి 150వ సినిమా గురించి అభిమానులు ఎప్ప‌టి నుంచో క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా వాళ్ల‌ని వెయిటింగ్‌లో పెట్టేసింది మెగా బృందం. గ‌తేడాది ఆగ‌స్టు 21 చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా చిరు సినిమాపై ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉందని అందరూ ఆశపడ్డారు కానీ జరగలేదు.  ఈలోగా రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజూ వ‌చ్చేస్తోంది. ఈనెల 27న చ‌ర‌ణ్ బ‌ర్త్ డే. ఆ రోజైనా చిరు 150వ సినిమా గురించి శుభ‌వార్త విరొచ్చ‌ని అభిమానులు గంపెడాశ‌లు పెట్టుకొన్నారు.


తండ్రి చిరంజీవితో రాంచరణ్


దీనికి ఓ కారణం ఉంది. గతంలో రాంచరణ్ తన తండ్రి 150 వ సినిమాకు స్వయంగా తానే నిర్మాతగా వ్యవహరిస్తానని చెప్పాడు.  మరి  త‌న పుట్టిన రోజు కానుక‌గా చిరు సినిమా గురించి ఏమైనా చెబుతాడేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతే కాదండోయ్ ఆ మధ్య సోషల్ మీడియాలో చిరంజీవి సినిమాకు ఈయన దర్శకుడు అని సినిమా పేరు జానిభాయ్ అని రక రకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. అలాగే   కొన్ని రోజులుగా చిరంజీవి ఇల్లు సంద‌డి సంద‌డిగా ఉంది. ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లూ చిరు ఇంటికివెళ్లి క‌ల‌సి వ‌స్తున్నారు. వాతావ‌ర‌ణం చూస్తుంటే... 150వ సినిమాకి సంబంధించి ఏదో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చేలానే ఉంది. ఆ ముహూర్తం ఈనెల 27నే ఫిక్స‌యితే... చ‌ర‌ణ్ పుట్టిన రోజుకి మెగా అభిమానుల మంచి తీపి కబురు అందించనున్నారా అని ఎదురు చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: