గోపాల గోపాల సినిమా తర్వాత పవన్ కళ్యాన్ ఏ సినిమా సెట్ పైకి రాలేదు. కానీ సినిమాల్లో నటిస్తున్నట్లు మాత్రం సోషల్ మీడియాలో పుంకాలు పుంకాలు గా వార్తలొచ్చాయి. మరి ఈ సంవత్సరమే రెండు సినిమాలో రిలీజ్ చేయాలనే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తుంది. గబ్బర్ సింగ్ 2, పేరు పెట్టని మరో సినిమా ఈ సంవత్సరం పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే గోపాల గోపాలను సంక్రాంతి (2015)కి విడుదల చేయగా.. గబ్బర్ సింగ్ 2 కూడా ఇదే ఏడాది రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


రైతులతో మమేకం అయిన పవన్ కళ్యాన్ వారు ఇచ్చి భోజనం చేస్తున్న దృశ్యం


పవన్ కళ్యాన్ ఒక్క సినిమా రంగంపైనే దృష్టి పెట్టకుండా ప్రజా సంక్షేమ పనులు కూడా చేస్తున్నాడు.  ఆ మధ్య రాజధాని కోసం భూమినిచ్చిన ఏపీ రైతులకు అండగా ఉంటానంటూ ప్రకటించిన పవన్ కల్యాణ్.. గోపాల గోపాలకు తర్వాత గబ్బర్ సింగ్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్  దాసరి ప్రొడక్షన్ హౌస్‌లో ఇదే ఏడాది కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: