ఆమె ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అందాల రాశి.. అతిలోక సుందరిగా అందరి హృదయాల్లో నిలిచి పోయింది. ఆమె ఎవరూ ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది అదేనండి శ్రీదేవి. ఈమె సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది. బాలీవుడ్ లో ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో అందరి ప్రశసంలు పొందింది. అప్పుడప్పుడు ఫోటో షూట్స్, మూవీ ఫంక్షన్లకు అటెండ్ అవుతూ వార్తల్లో నానుతుంది.


ఇప్పటికీ వన్నె తగ్గని శ్రీదేవి


తాజాగా రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం  శ్రీదేవి ని  సంప్రదించారట కాని తాను నటించలేనని సున్నతంగా తిరస్కరించిందట. అలా ఎందుకు చెప్పిందబ్బా మెగ వారసునికి తల్లిగా చేస్తు మంచి పేరే వస్తుంది కదా మరి ఎందుకు తిరస్కరించినట్లు అని రక రకాల ఊహాగానాలు వస్తున్నాయి.


ఓ ఆడియో ఫంక్షన్లో ముచ్చటించకుంటున్న రాంచరణ్, ప్రభాస్


మరి అదే శ్రీదేవి ప్రభాస్ హీరోగా నటించే సినిమాలో తల్లి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ? ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. చరణ్ సినిమాకు నో అన్న శ్రీదేవి ప్రభాస్ సినిమాకు ఎస్ అన్నదంటే ..? ఏమిటి సమస్య అనే ఆలోచనలు మొదలయ్యాయి. మరి ఇద్దరూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలే శ్రీదేవికి ఎక్కడ తేడా కొట్టిందబ్బా అని టాలీవుడు వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నదియా మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమెకు ఆపర్ల మీద ఆఫర్లు వచ్చాయి. శ్రీదేవి ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతుందా అందరూ గుస గుసలాడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: