కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమా అందిరికీ సుపరిచితమే. బ్రహ్మానందం జోడిగా చాలా సినిమాల్లో వచ్చిన హేమా ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇప్పడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది హేమా. సహజంగానే సెటైర్లు వేయడంలో హేమ నెంబర్ వన్. మొన్నామధ్య పవనీజం సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో నారాయణ మూర్తి మాట్లాడుతుండగా కిల కిల నవ్వింది ఆ నవ్వుకు అర్థం ఏమిటో కాని ఆయన మటుకు నువ్వ రాజకీయాల్లో పైకి వస్తావమ్మా అంతే కాదు ముఖ్యమంత్రివి కూడా అవుతావు కానీ పార్టీలు మాత్రం మారకు అని దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. 


దర్శకుడు బాపు తో హేమ


తాజాగా మా మూవీ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ రసవత్తరంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోటీలో రాజేంద్ర ప్రసాద్, జయసుధ మధ్య పోటీ తీవ్రం అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ కి నాగబాబు సపోర్ట్ చేస్తున్నవిషయంపై హేమా తీవ్ర విమర్శలు చేసింది. గతంలో     అధ్యక్షుడి గా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలను చేయకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ మరొకరికి ఎలా మద్దతు ఇస్తారని ,అసలు నువ్వు పదవి ని చేపట్టిన సమయంలో ఏం చేసావని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది . హేమ జయసుధ కు మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తోంది . కాగా రాజేంద్ర ప్రసాద్ ని మా అధ్యక్షుడి గా బలపరుస్తూ తెరవెనుక మంత్రాంగం చేస్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబు . మెగా బ్రదర్ అయినప్పటికీ హేమ ఇలా విమర్శలు చేస్తుందేమిటా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: