మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హాట్ హాట్ గా జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ లో ఉన్న శివాజీ రాజా తప్పుకున్నట్టు ప్రకటించడం సంచలనం రేపింది. శివాజీ రాజా మాట్లాడుతూ తన క్యారెక్టర్‌ ఏంటో సినీ వర్గాలందరికీ తెలుసునని, ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పేద కళాకారులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. అసోసియేషన్‌ మెట్లు ఎక్కే అర్హత లేని వారు ప్యానెల్‌లో ఉన్నారన్నారు. 30 ఏళ్ల స్నేహానికి అలీ ద్రోహం చేశాడని, అలీ నమ్మక ద్రోహం చేస్తాడని అస్సలు ఊహించలేదని నటుడు శివాజీ రాజా అన్నాడు.


రాజేంద్ర ప్రసాద్ పెట్టిన మీటింగ్ లో పాల్గొన్న ఏడిద, నాగబాబు, శివాజీరాజ,ఉత్తేజ్


ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నన్ను ఎవ్వరూ బెదిరించలేదు. అయినా నేను దేనికీ బయపడను అది చావైనా సరే వెంట్రుకతో సమానం. మురళీ మోహన్ గారి దగ్గర పద్నాలుగు సంవత్సరాలుగా చేశాను. రాజేంద్రప్రసాద్ నాకు సీనియర్. ఆయన పేరు చెప్పుకొని బతికిన వాళ్లం. ఇద్దరు ముగ్గురు హీరోలను అడిగాం. ఎవ్వరూ రాలేదు. నా పద్నాలుగేళ్లలో ఇంత దారుణమైన ఎలక్షన్ కమిషనర్లను చూడలేదు. వాళ్ల గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను. అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు శివాజీ రాజా.

 రాజేంద్రప్రసాద్ గురించి శివాజీ రాజా మాట్లాడుతూ, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి రాజేంద్రప్రసాద్ అని తెలిపారు. ప్రెసిడెంటుగా పోటీకి ఎవరూ సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో, తామే వెళ్లి ఆయనను మా అధ్యక్షుడిగా పోటీ చేయాలని అడిగామని వెల్లడించాడు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌కు మంచి చేద్దామని రాజేంద్ర ప్రసాద్ ముందుకొచ్చాడని, ఆయనకు మద్దతుగా ఉన్నామని శివాజీ రాజా తెలిపాడు. అయితే తన ఓటు రాజేంద్రప్రసాద్ కేనని తెలిపిన శివాజీ రాజా... రాజేంద్రప్రసాద్ ప్యానల్ నుంచి సెక్రటరీగా పోటీ చేయడం లేదని, పోటీ నుంచి విరమించుకుంటున్నానని స్పష్టం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: