పవన్ చిరంజీవిల మధ్య సరైన సంబంధ బాంధవ్యాలు ప్రస్తుతం లేకపోయినా పవన్ అనుసరిస్తున్న ఒక వ్యూహాత్మక ఎత్తుగడను చిరంజీవి కూడా  అనుసరిస్తూ తన  తమ్ముడి బాటలో పయనిస్తున్నాడు అనే విశ్లేషణలు వినపడుతున్నాయి.  దీనికి  ఉదాహరణగా ఈమధ్య చిరంజీవి తీసుకున్న ఒక నిర్ణయం అని అంటున్నారు. 

ఇక వివరాలలోకి  వెళితే పవన్ మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఫంక్షన్ కు రాకుండా ఇంచుమించు యంగ్  మెగా హీరోలు తన పై ఎంత ఒత్తిడి చేసినా సున్నితంగా తిరస్కరిస్తూ మెగా హీరోల ఫంక్షన్స్ అన్నిటికీ దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు అదే పద్ధతి చిరంజీవి అనుసరించడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం మెగా కుటుంబంలో ఏడుగురు హీరోలు ఉండటంతో ఇంచుమించు వీరు నటిస్తున్న సినిమాల సంఖ్య 8 నుంచి 10 వరకు ప్రతి సంవత్సరం ఉంటూ ఉండటంతో ఈ సినిమాలకు సంబంధించిన ప్రతి ఆడియో ఫంక్షన్ కు చిరంజీవిని అతిధిగా రమ్మని ఒత్తిడి పెరిగి పోతోంది అన్నది వాస్తవం. మొహమాటంతో ఒప్పుకుని చిరంజీవి వచ్చినా అక్కడ పవన్ ప్రస్తావన రావడంతో తాను ఎదో ఒకటి మాట్లాడవలసి వస్తోందని ఈ మాటల పై మీడియా చేసే వ్యాఖ్యానాలతో పవన్ తో తనకు ఏర్పడ్డ దూరం మరింత పెరిగి పోతోందని బాధ పడుతున్నాడని  టాక్.
 
దీనికి పరిష్కారంగా తాను ఇక భవిష్యత్ లో జరిగే ఏ మెగా హీరో ఆడియో వేడుకలకు తాను అతిధిగా రానని చిరంజీవి తన కుటుంబ హీరోలకు స్పష్టం చేసినట్లు టాక్. అంతేకాదు మెగా హీరోలందరిని ఒకే వేదిక పై తీసుకు వచ్చే ఒకే ఒక్క ఫంక్షన్ తన 150వ సినిమా ఆడియో వేడుక మాత్రమేనని అప్పటి వరకు ఎవరి ఫంక్షన్స్ ను వారే నిర్వహించుకోవాలని చిరంజీవి మెగా హీరోలందరిని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: