నాని అంచనాలను తలక్రిందులు చేసి ‘జెండా  పై కపిరాజు’ కు వస్తున్న కలెక్షన్స్ నానీకే షాకింగ్ గా మారాయి అని అంటున్నారు. నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కలెక్షన్స్ కన్నా ‘జెండా పై కపిరాజు’ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ కొద్దిగా మెరుగుగా కనిపిస్తున్నాయి అన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి రెండవ వారం పోస్టర్ కూడా పడదేమో అని చాలామంది ఊహించిన అంచనాలను తారుమారు చేసింది ‘జెండా పై కపిరాజు’.

ఈ సినిమాలో మాస్ కు నచ్చే అనేక అంశాలు ఉండటంతో బిసి సెంటర్లలో ఈ సినిమా ఎవరేజ్ హిట్  గా నిలిచింది. ఇప్పుడు ఇదే పరిస్థితి సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ సినిమాకు కూడా ఏర్పడుతుందా? అంటూ కొందరు సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికి కారణo ‘రేయ్’ సినిమాలో కూడా మాస్ కు నచ్చే అనేక అంశాలు ఉన్నాయి.

సాయి ధరమ్ తేజ్ మాస్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్,  డాన్సులు ఈ సినిమాకు కథతో సంబంధం లేకుండా మాస్ ను ఆకర్షించే విధంగా ఉంటాయి అన్న వార్తలు కూడా ఉన్నాయి. దీనికితోడు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన శ్రద్దా దాస్, నయామీల ఎక్స్ పోజింగ్ తో పాటు వీరి హాట్ లుక్స్ సీన్స్ మాస్ ను బాగా ఆకర్షిస్తాయి అనే వాదన కూడా వినపడుతోంది.

నెగిటివ్ టాక్  తో మొదలై నెమ్మదిగా హిట్ టాక్ తెచ్చుకున్న  ‘జెండా పై కపిరాజు’ లా అదేవిధంగా నెగిటివ్ టాక్ తో విడుదల అవుతున్న ‘రేయ్’ కూడా మాస్ ని మెప్పించకలిగితే ఎంతో కొంత అదృష్టాన్ని ఈ సినిమా నిర్మాత చౌదరికి కలిగించినా ఆశ్చర్యం లేదు అని కొందరు విశ్లేషిస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: