వివాదాలకు దూరంగా ఉంటూ అందరి వాడుగా సినిమా రంగంలో  పేరు ప్రఖ్యాతలు సాధించుకున్న అలీ తనను నమ్మక ద్రోహం చేసాడు అంటూ ఒక ఛానల్ ప్రసారం చేసిన లైవ్ టెలికాస్ట్ కార్యక్రంలో  అభియోగాలు చేసిన యాక్టర్   శివాజీ రాజా మాటలు అనేక చర్చలకు తెర తీస్తున్నాయి. 

ఎప్పుడు లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పడి రెండు దశాబ్దాల తర్వాత ‘మా’ అధ్యక్ష  పదవికి జరుగుతున్న హోరాహోరి యుద్ధంలో ఒకరి  పై  ఒకరు చేసుకుంటున్న వ్యక్తిగత దూషణలు వింటున్న సామాన్యులు రాజకీయ నాయకులకు కళాకారులకు తేడా ఏమిటి అని కామెంట్స్ చేసుకుంటున్నారు. 

అదీ  కాకుండా మంచి మిత్రులుగా పేరు గాంచిన శివాజీరాజా అలీల స్నేహాన్ని కూడా  మర్చిపోయి  ఇలా బురద జల్లుకోవడం వెనుక  ఏమైనా బయటకు  రాని చీకటి కోణాలు ఉన్నాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు మరో రెండు  సంవత్సరాల వరకు తాను  ‘మా’ అసోసియేషన్ మెట్లు ఎక్కనని శివాజీ రాజా చేసిన ప్రతిజ్ఞ టాలీవుడ్  సినిమా కళాకారుల పరపతిని దిగజార్చే విధంగా తయారైంది అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. 

ఎటువంటి అధికారం కాని మరి ఎటువంటి హోదా కాని లేని ఒక చిన్న పదవి కోసం టాలీవుడ్ లో మంచి నటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తులు ఇలా  రోడెక్కడం చాలామందికి  అర్ధం కాని  ప్రశ్నగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: